‘ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలి'
SDPT: చిన్నకోడూరులో ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని శనివారం జిల్లా కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీవో జనార్ధన్ విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగిన పంచాయతీ కార్యదర్శులదే బాధ్యత అని పేర్కొన్నారు.