కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం: MLA పులివర్తి
TPT: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 37,40,528 రూపాయల నిధులు మంజూరయ్యాయి. సంబంధిత చెక్కులను బుధవారం ఎమ్మెల్యే పులివర్తి నాని బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని స్పష్టం చేశారు. చెక్కులు అందుకున్న బాధితులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.