రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఛాంబర్ ప్రారంభం
E.G: రాజమండ్రి నగర పాలక సంస్థలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఛాంబర్‌ను నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి ఇవాళ ప్రారంభించారు. అనంతరం కార్పొరేషన్ ఆవరణలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర సాధన పోరాట యోధుడు శ్రీ పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.