VIDEO: ఉరవకొండలో పుల్వామా అమరవీరులకు నివాళి
ATP: ఉరవకొండలోని టవర్ క్లాక్ వద్ద శనివారం పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన 40 మంది జవాన్ల స్మారకార్థం ఏబీవీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కన్వీనర్ శివరాజ్ మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల త్యాగం వెలకట్టలేనిదని, వారిని స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నేతలు పాల్గొన్నారు.