భారీ వర్షంతో తెగిపోయిన కల్వర్టు.. ఇబ్బంది పడుతున్న ప్రజలు

భారీ వర్షంతో తెగిపోయిన కల్వర్టు.. ఇబ్బంది పడుతున్న ప్రజలు

MLG: జిల్లా కన్నాయిగూడెం మండలంలో శుక్రవారం కురిసిన భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. భూపతిపూర్ గ్రామానికి వెళ్లే మార్గంలో చెరువు ఉప్పొంగడంతో ప్రధాన రహదారి పై ఉన్న కల్వర్టు తెగిపోయింది. దీంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సమస్య పై వెంటనే అధికారులు స్పందించి రాకపోకలను పునరుద్ధరించాలని గ్రామస్థులు శనివారం కోరుతున్నారు.