'విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీయాలి'
RR: ఇంటర్నేషనల్ ఉర్దూ డేను పురస్కరించుకొని SDNR నియోజకవర్గం ఫరూఖ్ నగర్‌లోని ZPHS ఉర్దూ మీడియం స్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి మనోహర్ హాజరయ్యారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని ప్రతిభను అనేక పోటీల ద్వారా వెలికి తీయాలన్నారు.