'జీపీఎస్‌లేని వాహనాలకు అనుమతి లేదు'
SKLM: 2025-26 సీజనుకు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులు తప్పనిసరిగా రైతు సేవా కేంద్రం ద్వారా జీపీఎస్ వాహనాలలోనే ధాన్యాన్ని తరలించాలని, జీపీఎస్ లేని వాహనంలో తరలించడం అనుమతించబడదన్నారు.