కంపెనీలో యంత్ర సామాగ్రి చోరి
MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్ శివారులోనే Clarion కంపెనీలో యంత్ర సామాగ్రి భారీగా చోరీ జరిగింది. మూడేళ్ల క్రితం కంపెనీ మూతపడగా, గ్రామానికి చెందిన ఇరువురిని వాచ్‌మెన్‌లుగా నియమించారు. శుక్రవారం చూడగా కంపెనీకి చెందిన విలువైన భారీ మోటార్లు, పంపులు, ట్రాన్స్ ఫార్మర్ కాయల్స్, ఆయిల్ చోరీ జరిగింది. ఈ విషయాన్ని మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.