VIDEO: కుబీర్‌లో ప్రారంభమైన కుస్తీ పోటీలు
NRML: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కుబీర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మైదానంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించి కుస్తీ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి మల్ల యోధులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.