బాలికపై వేధింపులు..యువకుడి పై పోక్సో కేసు నమోదు

MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో బాలికను వేధించిన ఘటనలో యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై శివ నాగేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మనోహర్ అనే యువకుడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం బాలిక తల్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.