ఎన్నికల నియమావళిపై పోలీసు కళాబృందం అవగాహన

ఎన్నికల నియమావళిపై పోలీసు కళాబృందం అవగాహన

SRPT: స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలులో భాగంగా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు కళాకారులు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఎన్నికల నియమావళి దాని ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ... ప్రజలందరూ నియమావళికి లోబడి నడుచుకోవాలని కోరారు.