అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
HNK: నియోజకవర్గ అభివృద్ధిని నిర్దేశిత లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం, స్థానిక అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని MLA నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం 50వ డివిజన్ పరిధిలో రూ.1.17 కోట్లతో చేపడుతున్న అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు MLA శంకుస్థాపన చేశారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆయన కాంట్రాక్టర్లను ఆదేశించారు.