నల్లచెరువులో వ్యక్తి దారుణ హత్య

నల్లచెరువులో వ్యక్తి దారుణ హత్య

సత్యసాయి: నల్లచెరువు మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఓరవాయి గ్రామంలో ఎల్లమ్మ స్వామి ఆలయం సమీపంలో చలపతి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.