నేడు PGRS కార్యక్రమం
అనకాపల్లి కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని మున్సిపల్, డివిజనల్, మండల కార్యాలయాల్లో నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. స్వయంగా రాలేనివారు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు.