'టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి'
NRML: ఇన్- సర్వీస్‌లో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు ముఖ్యంగా 2010కు ముందు నియమితులైన వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దర్శనం దేవేందర్, ప్రధాన కార్యదర్శి గడ్డం భూమన్న ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో వారు మాట్లాడుతూ.. దీర్ఘకాల సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ను పరిగణలోకి తీసుకోవద్దన్నారు.