మాజీ సీఎం జగన్‌ను కలిసిన కైలే అనిల్ కుమార్

మాజీ సీఎం జగన్‌ను కలిసిన కైలే అనిల్ కుమార్

కృష్ణా: తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి, నియోజకవర్గంలోని రైతుల సమస్యలను వివరించారు. తాజాగా సంభవించిన తుఫాన్ కారణంగా భారీగా నష్టపోయిన రైతుల పరిస్థితి, పంటలు దెబ్బతినడం వల్ల ఎదురైన ఆర్థిక ఇబ్బందులు గురించి వివరించారు. ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు పడుతున్న కష్టాలపై చర్చించారు.