సమ్మెకు దిగనున్న మున్సిపల్ కార్మికులు

సమ్మెకు దిగనున్న మున్సిపల్ కార్మికులు

GNTR: వేతనాల పెంపు, సమస్యల పరిష్కారం డిమాండ్‌ చేస్తూ తెనాలిలో మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు బుధవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. ఈ మేరకు సీఐటీయూ నాయకులతో కలిసి కార్మికులు మంగళవారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతికి సమ్మె నోటీసు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా సమ్మె జరుగుతున్నందున తాము కూడా విధులకు హాజరుకావడం లేదని స్పష్టం చేశారు.