'అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం'

KDP: అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని జమ్మలమడుగు నియోజకవర్గ ఇంఛార్జ్ భూపేశ్ అన్నారు. మండల పరిధిలోని లింగాపురంలో బుధవారం 'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గురించి వారికి వివరించారు. అనంతరం సూపర్ - 6 హామీలను తప్పక అమలు చేస్తుందని హామీ ఇచ్చారు.