చిన్నముష్టూరులో భర్తపై దాడి చేసిన భార్య

చిన్నముష్టూరులో భర్తపై దాడి చేసిన భార్య

ATP: ఉరవకొండ మండలం చిన్నముష్టూరు గ్రామంలో భర్త ఓబులేసుపై భార్య ఉలిగమ్మ కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. భర్త ప్రతిరోజూ మద్యం తాగి గొడవపడుతున్నాడని, భరించలేక దాడి చేశానని ఆమె తెలిపింది. రక్త గాయాలతో ఉన్న అతడిని స్థానికులు ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.