గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో యువకుడు మంగళవారం ఉదయం గల్లంతైన విషయం తెలిసిందే. స్థానికుల కథనం మేరకు.. విజయవాడ నుంచి సూర్యలంక తీరానికి విచ్చేసిన సాయి అనే యువకుడు తీరంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతయ్యాడు. గమనించిన పోలీసులు వెంటనే గజ ఈతగాళ్ల సాయంతో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది.