VIDEO: గిద్దలూరులో పెరిగిన ఉష్ణోగ్రతలు
ప్రకాశం: గిద్దలూరు మండలంలో మార్చి నెలలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరుకుంది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య వేడి గాలులు వీస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. దీంతో పట్టణంలోని ప్రధాన వీధులు, వ్యాపార సముదాయాలు జనసంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.