అమరావతి బిల్లుపై విశాఖలో సంబరాలు
VSP: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై జిల్లా టీడీపీ కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా టీడీపీ నేతలు కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం టపాసులు కాల్చి “జై అమరావతి” నినాదాలతో ఉత్సవాలు జరుపుకున్నారు. అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు.