గిద్దలూరులో 12 అడుగుల కొండచిలువ హల్చల్

గిద్దలూరులో 12 అడుగుల కొండచిలువ హల్చల్

ప్రకాశం: గిద్దలూరు మండలం కొండపేటలో 12 అడుగుల కొండచిలువ కలకలం సృష్టించింది. దీంతో స్థానికులు అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. FRO మధు ప్రియాంక ఆదేశాల మేరకు రెస్క్యూ టీం ప్రసాద్, మౌలాలి అక్కడికి చేరుకున్నారు. వారు చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు. పాములు కనిపిస్తే చంపకుండా అటవీశాఖకు సమాచారమిస్తే పట్టుకొని సురక్షిత ప్రాంతాల్లో వదులుతామని తెలిపారు.