నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల

NZB: నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని బుధవారం దిగువన ఉన్న అల్లిసాగర్‌కు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ శివప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, బోధన్ పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యవసర తాగునీటి అవసరం నిమిత్తం ప్రధాన కాలువ ద్వారా 1,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు నీటిలోకి దిగరాదని హెచ్చరించారు.