ముస్లిం మైనారిటీ సోదరులతో మంత్రి సవిత సమావేశం
సత్యసాయి: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత మంగళవారం ముస్లిం మైనారిటీ సోదరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెనుకొండలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ముస్లిం సోదరుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.