VIDEO: చెరువును తలపిస్తున్న ప్రాథమిక పాఠశాల..!

BDK: సుజాతనగర్ మండలం నిమ్మలగూడెం ప్రాథమిక పాఠశాల చెరువును తలపిస్తోంది. రోడ్డు కంటే తక్కువ ఎత్తులో ఉండటంతో కొద్దిపాటి వర్షానికే నీరు నిలిచిపోతుంది. దీని వల్ల విద్యార్థులు పాఠశాలలోకి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని గ్రామస్థులు చెప్పారు. సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు.