'సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి'

'సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి'

ప్రకాశం: సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. తెలిసిన వ్యక్తుల నుంచి డబ్బులు అత్యవసరం అంటూ సోషల్ మీడియాలో అడిగితే వెంటనే స్పందించకుండా ముందుగా ఫోన్ చేసి నిర్ధారించుకోవాలన్నారు. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ కొత్త రకాల మోసాలు సైతం వెలుగులోకి వస్తున్నాయన్నారు.