అలంపూర్ నూతన కమిషనర్‌ బాధ్యతలు స్వీకరణ

అలంపూర్ నూతన కమిషనర్‌ బాధ్యతలు  స్వీకరణ

JDWL: అలంపూర్ పురపాలిక నూతన కమిషనర్‌గా ఎన్. శంకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. రెండు నెలలుగా ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన  శ్రీరాములు సాధారణ బదిలీలో మరో మున్సిపాలిటీకి వెళ్లారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్ శంకర్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన డ్రైనేజీ మరియు తాగునీటి సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.