పద్మగిరి కొండను కాపాడండి.. వైసీపీ నేత వినతి

తిరుపతి: తిరుపతి రూరల్ మండలం తనపల్లి సమీపంలోని పద్మగిరి కొండను భూ ఆక్రమణల నుంచి రక్షించాలని వైసీపీ నేత హేమంత్ కుమార్ రెడ్డి సోమవారం కలెక్టర్ వెంకటేశ్వరుకు వినతిపత్రం సమర్పించారు. ఆక్రమణల వల్ల కోట్ల రూపాయల రహదారి దెబ్బతినే ప్రమాదముందని ఆయన తెలిపారు. కలెక్టర్ తహశీల్దారుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినా, ఆయన అందుబాటులో లేకపోవడంతో అర్జీదారు వెనుదిరగాల్సి వచ్చింది.