VIDEO: స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదాం: ఛైర్ పర్సన్
NZB: ఆర్మూర్ మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామని ఛైర్ పర్సన్ గోనె లహరి రఘు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం 15వ వార్డులో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను ఛైర్ పర్సన్, కమిషనర్ ఉమామహేశ్వరరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ నరేందర్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి తదితరులు పాల్గొన్నారు.