గుడ్లవల్లేరులో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్

గుడ్లవల్లేరులో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్

కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామంలో శనివారం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో విస్తృతంగా శుభ్రపరిచారు. మన గ్రామం పరిశుభ్రంగా, అందంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ తెలిపారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నిర్ణీత డస్ట్‌బిన్‌లలో వేసి, వ్యాధులు, దోమల వ్యాప్తిని అరికట్టాలన్నారు.