ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య
NDL: కొలిమిగుండ్లలోని అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఇవాళ కార్తీక్ కుమార్ అనే యువకుడు తన ఇంట్లో దంతెకు నవారుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇటీవలే మృతుడి తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. తల్లి మృతి చెందడంతో కార్తీక్ డిఫెన్స్‌లోకి వెళ్లిపోయి జీవితంపై విరక్తి చెంది, ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.