శివాలయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం

శివాలయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం

CTR: పుంగనూరు 30వ వార్డు శ్రీభోగనంజుండేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. గంగ, గణపతి, కలశ పూజలు చేశారు. అంకురార్పణం, ధ్వజారోహణం, నవగ్రహారాధన, అభిషేకం, హోమాది కార్యక్రమాలను పండితులు నిర్వహించారు. బుధవారం సాయంత్రం కళ్యాణోత్సవం జరుగుతుందని EO తెలిపారు.