‘ట్రంప్ మాట వింటాం.. కానీ మాది సొంత నిర్ణయమే’

‘ట్రంప్ మాట వింటాం.. కానీ మాది సొంత నిర్ణయమే’

ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై దాడిని సమర్థించుకుంటూనే, ట్రంప్ సూచనలను పాటిస్తామని నెతన్యాహు వెల్లడించారు. USను తాము యుద్ధంలోకి లాగలేదని, ట్రంప్‌కు ఏం చేయాలో ఎవరూ చెప్పలేరని వ్యాఖ్యానించారు. హర్మూజ్ జలసంధిని మూసివేసి ప్రపంచాన్ని బెదిరించాలన్న ఇరాన్ ప్లాన్ ఫలించదన్నారు. అవసరమైతే యుద్ధం వైమానిక స్థాయి నుంచి భూతల దాడులకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు.