VIDEO: నాచారం పీఎస్ పరిధిలో వ్యక్తి ఆత్మహత్య

మేడ్చల్: నాచారం పీఎస్ పరిధిలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ప్రవీణ్ అనే వ్యక్తి బుధవారం హబ్సిగూడలో ద్వారక హోటల్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, అదే హోటల్లో ప్రవీణ్ రిసెప్షనిస్ట్‌గా పని చేస్తున్నాడు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న నాచారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.