VIDEO: ఆరాధనోత్సవాలపై డ్రోన్ నిఘా
సత్యసాయి: పుట్టపర్తిలో శ్రీ సత్య సాయి బాబా ఆరాధనోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. భక్తులు, వీఐపీలు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, పార్కింగ్ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంచారు. పోలీసులు మోహరించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.