పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ATP: డీ.హిరేహాల్(మం) గోడిసలపల్లిలో నాగరాజు(38) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గురుప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మనస్తాపంతో విషం తాగగా, కుటుంబ సభ్యులు బళ్లారి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడని తెలిపారు.