కనిగిరిలో సామూహిక వరలక్ష్మీ వ్రతం

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం ఈశ్వరి దేనికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం సామూహిక వరలక్ష్మీ వ్రతం కార్యక్రమాన్ని పండితులు నిర్వహించారు. మహిళలు అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.