డీసీసీ అధ్యక్షుడుకి శుభాకాంక్షలు తెలిపిన కొమ్మూరి
JN: నూతన డీసీసీ అధ్యక్షురాలుగా నియమితులైన లాకావత్ ధన్వంతిని మాజీ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ.. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గంగం నరసింహారెడ్డి, లక్ష్మీనారాయణ, వగలబోయిన యాదగిరి తదితరులున్నారు.