తేనెటీగల దాడి.. BJP కార్యకర్తలకు తీవ్రగాయాలు

తేనెటీగల దాడి.. BJP కార్యకర్తలకు తీవ్రగాయాలు

KNR: రామడుగు మండలం వెదిర గ్రామంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేపట్టిన 'అంజన్న ఆశీర్వాద యాత్ర'లో అపశ్రుతి చోటుచేసుకుంది. యాత్ర కొనసాగుతుండగా ఒక్కసారిగా తేనెటీగలు గుంపులుగా వచ్చి కార్యకర్తలపై దాడి చేశాయి. ఈ ఘటనలో బీజేపీ నాయకుడు శ్రీనివాస్ యాదవ్ తో పాటు, కార్పొరేటర్లు వేణు ప్రాసాద్, సాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన పార్టీ శ్రేణులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.