VIDEO: మొసలి పిల్ల ప్రత్యక్షం.. అధికారుల హెచ్చరిక
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం బుగ్గ మాధవరం సమీపంలో మొసలి పిల్ల ప్రత్యక్షం అయింది. బండ్ల రేవు వాగు వద్ద వాహనంపై వెళ్తున్న వ్యక్తులకు కనిపించడంతో మొబైల్ ఫోన్‌లో చిత్రించారు. బ్రిడ్జి పై పాకుతూ నీటిలోకి మొసలి పిల్ల జారిపోయింది. బండ్ల రేవు వాగు వైపు వెళ్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.