‘అమరవీరుల స్ఫూర్తితో విప్లవోద్యమాలను నిర్మిద్దాం’

KMM: అమరవీరుల స్ఫూర్తితో విప్లవ ఉద్యమాలను నిర్మిద్దామని సీపీఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి ఝాన్సీ అన్నారు. సోమవారం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో కామ్రేడ్ యాదగిరి చిత్రపటానికి నివాళులర్పించారు. విప్లవ ఉద్యమ నిర్మాణానికి పునాదులు వేసిన అమరవీరులు మూల స్తంభం లాంటి వారని పేర్కొన్నారు.