వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట
NLG: కొండమల్లేపల్లి మండలం చిన్నఆడిశర్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బుడ్డోని తండాలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహా ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బాలునాయక్ పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవరకొండ ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోశాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.