మహారుద్ర యాగ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

మహారుద్ర యాగ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

HNK: పరకాల పట్టణంలో కార్తిక మాస మహారుద్రయాగ ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం అధికారులు, నిర్వాహకులతో సమావేశమై వసతి, పార్కింగ్, తాగునీటి వంటి సదుపాయాలపై సూచనలు ఇచ్చారు. యాగం ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే శ్రీ భవాని కుంకుమేశ్వరాలయ భూమిపై జరుగుతున్న ఆక్రమణలకు తెరపడిందన్నారు.