ప్రాథమిక విద్య బలోపేతానికి ఏఐ పాఠాలు

KNR: ప్రాథమిక విద్య బలోపేతానికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) పాఠాలు దోహదం చేస్తాయని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం ప్రాథమిక పాఠశాల మద్దునూర్ లో "కృత్రిమ మేధ ద్వారా విద్య" పథకంలో భాగంగా ప్రాథమిక విద్య చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ ద్వారా విద్య బోధన ప్రారంభించారు. 3,4,5తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు మెరుగు పడుతాయన్నారు.