నీటి విడుదలతో నీట మునిగిన గుడిసెలు.!
KDP: బద్వేల్ మండలం బయనపల్లె చెరువులో వేసుకున్న నిరుపేదల గుడిసెలు నీట మునిగాయి. గత మూడు సంవత్సరాలుగా అక్కడ జీవనం సాగిస్తున్నారు. అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా తెలుగుగంగ కాలువ ద్వారా నీటిని చెరువులోకి విడుదల చేయడంతో రాత్రికి రాత్రి గుడిసెలను నీరు చుట్టుముట్టాయి. దీంతో సామగ్రి అక్కడే వదిలేసి బయటకు వచ్చారు.