నేడు డయల్ యువర్ సీఎండీ
VSP: విద్యుత్ సమస్యలపై సోమవారం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎండీ పృథ్వీరాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాలకు చెందిన వారు తమ సమస్యలను 8688400499 నెంబర్‌కు ఫోన్ చేసి తెలియ చేయాలన్నారు. ఉదయం 10:30 నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.