రేషన్ బియ్యం మాయం... డీలర్‌పై కేసు నమోదు
KMM: వేంసూరు మండలం దుద్దేపూడి గ్రామంలోని చౌక ధరల దుకాణాన్ని అధికారులు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 20.77 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం లోటు ఉన్నట్లు గుర్తించారు. దీంతో డీలర్‌పై నిత్యావసరాల చట్టం కింద 6A కేసు నమోదు చేశారు. మరోవైపు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం ఈ నెల 30 వరకు పంపిణీ జరుగుతుందని అధికారులు తెలిపారు.