పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల పరిశీలన
ELR: ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాలను కేంద్ర జల సంఘంలోని డిజైన్లు పరిశోధన విభాగం ఎక్స్ అఫిషియో సభ్యులు ఆదిత్య శర్మ, చీఫ్ ఇంజినీర్ ఎస్ఎస్ భక్షిలు సందర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణాలు, గ్యాప్–1, గ్యాప్–2 ఈసీఆర్ డ్యాం పనులు పరిశీలించారు. అనంతరం కేంద్ర జల సంఘం ఆమోదించిన డిజైన్లకు అనుగుణంగా పనుల అభివృద్ధి గురించి జలవనరుల శాఖ నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్షించారు.