సత్తా చాటిన ట్రాఫిక్ కానిస్టేబుల్
అన్నమయ్య: ప్రొద్దుటూరుకు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ మహబూబ్‌బాషా తైక్వాండో, ఫెన్సింగ్ క్రీడల్లో రాణిస్తూ పలు పతకాలు సాధించారు. చిన్న వయసులోనే శిక్షణ ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక అవార్డులు గెలుచుకున్నారు. ఇటీవల జలంధర్‌లో జరిగిన పోలీస్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించారు. యువ క్రీడికారులను ప్రోత్సాహించడమే అతని లక్షమని పేర్కొన్నారు.